Header Banner

పవన–సౌర శక్తితో ఏపీకి శక్తివంతమైన భవిష్యత్‌! వేల ఎకరాల్లో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం!

  Fri May 16, 2025 13:44        Politics

అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి నారా లోకేష్ రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టులో 2.8 గిగా వాట్ల సామర్థ్యంతో సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి జరుగనుంది. ఇందులో 1.8 గిగా వాట్ల సోలార్ పవర్, 1 గిగా వాట్ విండ్ పవర్ ఉంటాయి. అంతేగాక, 2 GWH సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ 2,300 ఎకరాల్లో రూ.22 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఇది కేవలం పరిశ్రమ మాత్రమే కాకుండా ఒక ఉద్యమంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.
ఈ ప్రాజెక్టు తొలి దశలో RENEW సంస్థ 587 MWP సోలార్, 250 MWH విండ్ శక్తిని ఉత్పత్తి చేయనుంది. 100% మేడ్-ఇన్-ఇండియా సోలార్ ప్యానెల్స్ వినియోగించనుండగా, వాటి శుభ్రత కోసం వాటర్‌లెస్ రోబోటిక్ టెక్నాలజీ వినియోగించనున్నారు. ఈ కాంప్లెక్స్ భవిష్యత్‌కు విద్యుత్ లోటు లేకుండా చేస్తుందని, ప్రతిరోజూ 4 పీక్ గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతుందని మంత్రి చెప్పారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 ఉద్యోగాలు కల్పిస్తారని, ఇది రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ రంగంలో జాతీయ నాయకత్వ స్థాయికి చేర్చుతుందని నారా లోకేష్ వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధిని వికేంద్రీకృతంగా కొనసాగిస్తామని తెలిపారు. అనంతపురానికి కియా మోటార్లను తీసుకొచ్చినట్లే, ఇక క్లీన్ ఎనర్జీ విప్లవానికి ఈ కాంప్లెక్స్ శంకుస్థాపనగా మారుతుందని అన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!

 

 తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RenewableEnergy #GreenEnergy #AndhraPradesh #SolarPower #WindEnergy #CleanEnergyRevolution